నేడు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి,అనంతరం భారీ సైకిల్ ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకలలో భాగంగా పార్టీలో విశిష్ట సేవలు అందించిన సీనియర్ నాయకులను శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎన్ని కష్టాలు వచ్చినా తమ వెంట నడిచిన కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పట్టణ,మండల, గ్రామ వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు..


