సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమా, తెలుగు వాళ్ళ కీర్తి ప్రతిష్టను గల్లీ నుంచి ఢిల్లీ వరకు, తెలుగు వాడు సత్తాను ఖండంతరాలు చాటి చెప్పిన మన తెలుగు వాడి గుండె చప్పుడు మన అందరి అన్న డాక్టర్ నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది, 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, కొత్తపాడు గ్రామంలో జెండా ఆవిష్కరించి, NTR విగ్రహానికి పుష్ప మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు శ్రీ కారెం బాబురావు గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే బడుగు బలహీనుల అభ్యున్నతికి, సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలని రాజ్యాంగాన్ని అమలుపరచిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవారి ఆకలి తీర్చడం కోసం కిలో రెండు రూపాయలు బియ్యం, దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత మన అన్న ఎన్టీఆర్ కు దక్కుతుంది అలాగే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదే, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం సమితులను రద్దుచేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆయనే ఇలా ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజా సేవలో వెలుగొందిన జ్యోతి NTR. అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో కొత్తపాడు గ్రామా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దండు గణపతి రాజు గారు, పార్టీ సెక్రటరీ నేకూరి ప్రసాద్ , మాజీ ఎంపిటిసి బొక్క కృష్ణ గారు, ఇరగవరం మండలం తెలుగు యువత అధ్యక్షులు కారెంరమేష్, చిట్టూరి సత్యనారాయణ, సిరి శెట్టి శ్రీను, కుక్కల త్రిమూర్తులు, బూడితి లాజరు, దొంగ సత్యనారాయణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link