తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
తణుకులో ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్జీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.
తణుకు పట్టణం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర. తణుకు మీదుగా తణుకు మండలం వేల్పూరు, ఇరగవరం మండలం రేలంగి, గవర్లపాలెం, అత్తిలి మండలం వరకు సాగనున్న సైకిల్ యాత్ర.
పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్న రాధాకృష్ణ.
రూపాయికే కిలో బియ్యం ప్రారంభించిన ఎన్టీఆర్. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి.


