తణుకు నుంచి అత్తిలి వరకు సైకిల్ యాత్ర చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకులో ఘనంగా 44వ టిడిపి ఆవిర్భావ వేడుకలు

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు

9 నెలల్లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

కార్యకర్త సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ

మరో 50 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకు డోకా లేదు

             ***

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీను స్థాపించిన నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల కాలంలోనే పార్టీను అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం తణుకులో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించి అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు. తణుకు ఆరవ వార్డు నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర తణుకు వేల్పూరు రేలంగి గవర్ల పాలెం మీదుగా అత్తిలి చేరుకుంది అంతకుముందు తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. విద్యావంతులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అనేకమంది పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుదని కొనియాడారు. నందమూరి తారక రామారావు ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ఆనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీను ప్రపంచ పటంలో నిలుపారని అన్నారు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతున్నారని అన్నారు. కార్యకర్తే అధినేత అనే నిదానదంతో యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారి క్షేమం కోసం అన్ని విధాలుగా అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడును తీసుకువస్తున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ పార్టీకు అండగా నిలబడిన నిలబడుతున్న కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరో 50 ఏళ్ల పాటు పార్టీకు డోకా లేకుండా సంస్థ గత నిర్మాణంలో సంస్థాపక పదవుల్లో పెద్దపీట వేస్తూ పార్టీను మరింత ముందుకు తీసుకొని వెళ్లే విధంగా భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించిన సైకిల్ యాత్ర అత్తిలి బయలుదేరి వెళ్ళింది. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు నాయకులతో సమీక్ష నిర్వహించారు. 40 ఏళ్లు పైబడి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలు 28 మందికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link