సనాతన సంప్రాదాలు, ధార్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు శోభాయాత్రలు ఉపయోగపడతాయన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మన ఉనికిని కాపాడుకోవడంతోపాటు సంస్కృతి సంప్రదాయాలు, ఐక్యతను భావితరాలకు చాటిచెప్పేందుకు అవకాశం ఉంటుందన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శ్రీరాముని శోభాయాత్రను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండే శ్రీరాముని జీవితం ఆదర్శనీయమని అన్నారు. యువతకు ధార్మిక విలువలు, హిందూ మూలాలు గుర్తు చేయడంతోపాటు భావితరాలకు అందించడమే ధ్యేయంగా ప్రతిఒక్కరు పాటుపడాలని కోరారు. సనాతన సంస్కృతిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు. ఈ శోభాయాత్రలో భక్తులతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ పాదయాత్ర చేశారు.


