విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన కూటమి ప్రభుత్వం

మంత్రి లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థ బలోపేతం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్వహణ, తాగునీటి సదుపాయం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో దేశంలోనే విద్యా వ్యవస్థను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో విద్యావ్యవస్థను చిన్నభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంసకర పాలన నుంచి బయటపడేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యంగా పాఠశాలల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేసి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link