దుష్టపాలనను అంతమొందిద్దాం: కారుమూరి నాగేశ్వరరావు  తణుకు (అక్షరభూమి)  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  డా.కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి ఎన్నో కుట్రలు చేసినప్పటికీ జగన్ ఏనాడూ భయపడకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” అంటూ నియంతృత్వ పాలన కొనసాగిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ యోధుడిలా పోరాటం చేస్తూ తన కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుతో నిలిచిందని తెలిపారు. రానున్న రోజుల్లో మనమందరం కలిసి దుష్టపాలన అంతమొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వంక రవీంద్ర మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని, వారి కృషి వల్లే పార్టీ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అందరం ఐక్యంగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link