మహిళల జీవితాల్లో వెలుగు నింపడానికి జీవితాన్ని ధారపోసిన భారతదేశపు మొదటి మహిళా సామాజికవేత్త సావిత్రిభాయ్ ఫూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం తణుకు పట్టణంలో గోస్తనీ వంతెన వద్ద జ్యోతిరావు పూలే సావిత్రి పూలే విగ్రహం వద్ద రాష్ట్ర బి.సి.మహిళా నాయకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వారికి నిమ్న జాతుల వారికి ముఖ్యంగా మహిళల జీవితాల్లో చదువు అనే వెలుగును నింపిన ఆశాజ్యోతి అని అన్నారు. ఈనాడు ప్రతి ఆడపిల్ల చదువుకుని ఉన్నారంటే ఆనాడు ఆ తల్లి మనకు చదువు అనే ఆయుధాన్ని అందించిన చదువులు తల్లి అని ఆ ఆదర్శ దంపతుల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలతో ముందుకు సాగుతుందని తెలియజేశారు.


