తూ.గో. జిల్లా ఉండ్రాజవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మతల్లి జాతర మహోత్సవములు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా గురువారం ఉదయం సంప్రదాయ బద్దంగా పుట్టింటివారు, అత్తింటి వారు అమ్మవారికి పూజాదికాలు నిర్వహించి నడివీధిలో పూరిగుడిసె నిర్మాణం కావించారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి మంగళ వాయిద్యాలతో, డప్పు మోతలతో, బాణాసంచా కాల్పులతో పురవీధులలో వైభవంగా ఊరేగించుకుంటూ గ్రామ దేవతల గరగలను శ్రీ ముత్యాలమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం పుట్టింటికి తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత 2016 తర్వాత 2026 సంవత్సరం జాతర నిర్వహించడంతో గ్రామంలో యువత భారీగా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భారీగా మహిళా భక్తులు యువకులు సందడిగా పాల్గొనడం జాతర మొదటి రోజే సందడి వాతావరణం కనిపించింది.


