వ్యర్థాలివ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి

సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం నందు స్వచ్ఛ రథాలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నూతన ఒరవడి

చెత్తకు విలువ కల్పిస్తూ 20 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ

నిడదవోలు నియోజకవర్గంలో మూడు ‘స్వచ్ఛ రథాల’కు పచ్చజెండా ఊపిన మంత్రి దుర్గేష్

నిడదవోలు:గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు, వ్యర్థాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాలకు సంబంధించిన 3 స్వచ్ఛ రథాలను మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

చెత్తతో వ్యాపారం – ఇంటి వద్దకే నిత్యావసరాలు

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ పథకం యొక్క ప్రత్యేకతను వివరించారు.ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ రథం వాహనానికి పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్లు, కవర్లు, ప్యాకెట్లు, గాజు సీసాలు, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, నూనెడబ్బాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం వ్యర్థాలను ఇస్తే వాటిని తూకం వేస్తారని తెలిపారు. అనంతరం ఆ వ్యర్థాల విలువకు సమానమైన నగదును లెక్కించి, దానికి బదులుగా సబ్బులు, టూత్ పేస్టులు, ఉల్లిపాయలు వంటి సుమారు 20 రకాల నిత్యావసర సరకులను అక్కడికక్కడే అందజేస్తారని వెల్లడించారు. గ్రామాలు చెత్త రహితంగా మారడం, ప్రజలకు ఇంటి వద్దే సరకులు అందడం, వాహనదారులకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు..పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం మంచి విజయం సాధించిందని. ప్రజల నుండి విశేష స్పందన రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు.స్వచ్ఛ రథం స్వచ్ఛ సంకల్పం ఇదే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు.

కార్యక్రమం అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ప్రజా సమస్యల విషయమై అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజా సమస్య ఏదైనా తమకు తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ లు నేర్చుకునేందుకు శిక్షణ పొందిన మహిళలకు త్వరలోనే మిషన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని, ఈ అంశాన్ని అసెంబ్లీ మరియు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link