తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా జరిగిన “అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం”

తణుకు, ఫిబ్రవరి 21, 2026 : మాతృమూర్తిని ప్రేమించి, గౌరవించినట్లుగానే మన మాతృ భాష అయిన తెలుగును ప్రేమించి, గౌరవించాలని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు.

“అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం జరిగిన సభలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాల పూర్వ విద్యార్థిగా, తాను చదువుకున్న కళాశాలలో ఉపన్యాసం చెప్పడం ఒక మహత్భాగ్యంగా భావిస్తున్నట్లు కోట రామ ప్రసాద్ చెప్పారు.

సభకు తొలుత ఆంగ్ల భాష అధ్యాపకురాలు డా.టి.సంధ్యారాణి స్వాగతం పలికారు. సభకు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. కె.రవీంద్ర బాబు అధ్యక్షత వహించారు. తెలుగు భాష అధ్యాపకురాలు డా.డి.కనకమహాలక్ష్మి, కోట రామ ప్రసాద్ ను సభకు పరిచయం చేశారు.

విద్యార్థుల తరఫున బి.ఏ. రాజనీతి శాస్త్ర విద్యార్థి ఎన్.మహేష్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల భాషలలో పద్య పఠనం, రచనల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థినీవిద్యార్థులకు కోట రామ ప్రసాద్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.

కార్యక్రమంలో చివరిగా కళాశాల తరఫున కోట రామప్రసాద్ ను దుశ్శాలువా, ఫలములతో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. కె.రవీంద్రబాబు, తెలుగు అధ్యాపకురాలు డా.డి.కనకమహాలక్ష్మి, ఆంగ్ల అధ్యాపకురాలు డా.టి.సంధ్యారాణి, గణిత అధ్యాపకులు ఆర్.ఎస్.యం.భూపాల్, వాణిజ్య శాఖ అధ్యాపకులు ఐ.వి.నారాయణ, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు యస్.చాముండేశ్వరి అధ్యాపక బృందం ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి కోట రామ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link