సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 17 నుండి 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ ఫయాజ్ తెలుపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గటం లాంటి లక్షణాలు ఉంటే కఫం పరీక్షలు ఎక్స్ రే చేయించుకోవాలని సూచించారు. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారని మందులు ఉచితంగా ఇస్తారని తెలియజేశారు. టీబి సూపర్వైజర్ పోతురాజు మాట్లాడుతూ టీబి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబి పేషంట్లను దత్తత తీసుకోవాలని వారికి పోషకాహార కిట్లు అందించాలని దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రజలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఈ వారం రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. టీబి రహిత దేశంగా తీర్చిదిద్దాలంటే ఇది మనందరి బాధ్యత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రహేన, డాక్టర్ జానకి ప్రియ, హెడ్ సిస్టర్ హెప్సిబా, ఎల్. టి.రాజ్ కుమార్, అనిల్, ఏం.రాంబాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


