ఘనంగా పాలంగి రామేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి కళ్యాణం భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన శివాలయం కావడంతో పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు. నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అధికారులు క్యూ లైన్లను ఏర్పాటు, దాతల దాతృత్వంతో భారీ ఎత్తున అన్నదానానికి దేవాలయ ఆవరణలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link