ప్రపంచ కేన్సర్ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ….
అన్ని గ్రామాల్లో కూడా కేన్సర్ పై అవగాహన కార్యక్రమములు నిర్వహించడమైనది. దానిలో భాగంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు కేన్సర్ వ్యాధి అవగాహన పై క్విజ్ పోటీ నిర్వహించడమైనది. అనంతరం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఆర్.ఉషా దేవి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయులకు కూడా కేన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ఉషాదేవి మాట్లాడుతూ ఈ రోజుల్లో మన రాష్ట్రంలో బి.పి., షుగర్ వ్యాధులు తరువాత అంత స్థాయిలో కేన్సర్ వ్యాధి కేసులు కూడ నమోదు అవుతున్న దృష్ట్యా దీనిపై ప్రజల్లో అవగాహన కలిగినట్లయితే, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే, కేన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించుటవల్ల, వారికి పూర్తిగా నయం చేయడం ద్వారా మరణం సంభవించకుండా చూడవచ్చునని తెలియచేశారు. అందువల్లనే, విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే కేన్సర్ వ్యాధుల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు అనేలక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కావున 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ మీగ్రామాల్లో ఉన్న ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎమ్స్, ఎం.ఎల్.హెచ్.పి లు ద్వారా స్క్రీనింగ్ చేయించుకుంటే, వారి ద్వారా అనుమానిత లక్షణాలు గల వారిని గుర్తించి, జిల్లాలో ఉన్న టీచింగ్ ఆసుపత్రిలో ఉన్న కేన్సర్ పరీక్షల యూనిట్ కి పంపించి, తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించి, వ్యాధి ఉన్న వారికి తదుపరి వైద్యం కూడా ఉచితంగా చేసే, ఏర్పాటు ప్రభుత్వం ద్వారా కల్పించబడినది అని తెలియ చేశారు. ఆరోగ్యకమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, అలవర్చుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా రక్షణ పొందవచ్చు అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఇ. ఓ సక్సేన రాజు, ఎం.ఈ.ఓ 2 శ్రీమతి శారదా జ్యోత్స్న, హెడ్ మాస్టర్ పి.రామకృష్ణ, ఉపాధ్యాయులు, సి.హెచ్.ఓ ఎం.సుబ్రహ్మణ్యం, పి.హెచ్.ఎన్ శ్రీమతి కె.డి.వి.ఎల్.కుమారి, హెచ్.వి.శ్రీమతి మేరీ రత్నకుమారి, ఏ ఎన్ ఎం. ఆర్.సత్యవతి, ఎం.ఎల్.హెచ్.పి. టి.పూజశ్రీదుర్గ, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.


