వైసిపి హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంపు
కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల తగ్గింపు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రేలంగి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకు వెళుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని అన్నారు. ఇరగవరం మండలం రేలంగి ఇందిరానగర్ లో సోమవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావని గతంలో వైసిపి నాయకులు దుష్ప్రచారం చేశారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పంపిన ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారికి త్వరలోనే పెన్షన్లు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు సైతం అమలు చేసిన ఘనత ఓటమి ప్రభుత్వానిదని అన్నారు. విద్యుత్ చార్జీలకు సంబంధించి ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరించి ప్రజలపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇరగవరం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


