రాజకీయ దురుద్దేశంతోనే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థలు

రాజకీయ కక్షతోనే ఆనాడు చంద్రబాబుపై అక్రమ కేసులు

ఆనాడు జగన్ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని పరిపాలన

యువత భవిష్యత్తు కోసం తపన పడే చంద్రబాబు నాయుడు

మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవమున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనీ గత వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబునాయుడును రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడుని 53 రోజులు జైల్లో ఉంచారని అయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబునాయుడు ప్రమేయం లేదని నిర్దోషిగా క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పారు సోమవారం తణుకుపోవటమే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టి మానసిక స్థైర్యం దెబ్బతీయాలని అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిఐడి చంద్రబాబు నాయుడు విషయంలో అవకతవకులు జరగలేదని చెప్పి అక్రమంగా ఇరికించారని క్లీన్ చీట్ ఇచ్చిందని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మరో 36 మందికి సిఐడి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు ఇరికించి, వైసిపి ప్రభుత్వం వారిని దోషులుగా నిలపాలని జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్ర భగ్నమయిందన్నారు.
కడిగిన ఆని ముత్యంలాగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని సుమారు రూ. 3300 కోట్లతో రాష్ట్రంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోకాలొడ్డి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని అర్ధరాత్రి హడావుడిగా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బంది గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని షెల్ కంపెనీలు పెట్టి రూ. 40 వేల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలల్లో జైల్లో ఉన్నాడని ఆ కుట్రతో చంద్రబాబుని అరెస్టు చేయాలని ఇటువంటి అక్రమ కేసులు పెట్టి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఈ క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డికి వైసిపి నాయకులకు చంప పెట్టు లాంటిదన్నారు. వైసిపి నాయకులు,జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన సిబిఐ దర్యాప్తు కేసులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు రెండు దర్యాప్తులు సంస్థలు కూడా క్లీన్ చీట్ ఇచ్చాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన దుర్మార్గపు చర్యలతో 11 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు సుమారు 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని ధ్యేయంతో ప్రధానమంత్రి మోడీ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link