ఇరగవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి ఈ-గవర్నన్స్ పై క్లస్టర్ స్థాయిలో అత్తిలి, పెనుమంట్ర మరియు ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణా కార్యక్రమము జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి ఈ-గవర్నన్స్ పై పంచాయతీలు సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని మెరుగుపరచబడటానికి వ్యూహాలు సాంకేతికతలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. సదరు శిక్షణా కార్యక్రమములో డిప్యూటీ ఎంపిడిఓ(పిఆర్) పి.వి.ఎన్.నరసింహమూర్తి, డిప్యూటీ ఎంపిడిఓ (జి.ఎస్.డబ్ల్యు.ఎస్.) వి.వి.నారాయణ, అత్తిలి, పెనుమంట్ర, ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


