గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉండ్రాజవరం మండలం, మోర్త పూలే అంబేద్కర్ బహుజన ఫౌండేషన్ రాష్ట్రకార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగం అమలు జరిగి 77సంవత్సరాలు అయిందని, డా. బి.ఆర్.అంబేద్కర్ చూపిన సమానత్వం, స్వేచ్ఛ అందరికి అందాలనేది అయన చూపినదారి అన్నారు. అయన యొక్క ఆలోచన విధానం ఈరోజు మనందరికీ గొప్పవరం అన్నారు. ఈసందర్బంగా కార్యాలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, చిన్నారులకు బిస్కెట్ లు పంపిణి్చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఫౌండేషన్ బృందం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


