ఉండ్రాజవరంలో ఈ గవర్నెన్స్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

ఉండ్రాజవరం : ఈ గవర్నెన్స్ – గుడ్ గవర్నెన్స్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం,  గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం లో గ్రేడ్1 నుండి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ వారి ఇంటి వద్దనే అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో అవసరమైన వివిధ  కార్యక్రమాల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా వారి వారి ఇళ్ల వద్దనే లభ్యమవుతాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఉండ్రాజవరం డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయ శర్మ, పాల్గొన్నారు.  ఉండ్రాజవరం, పెరవలి,  నిడదవోలు, తణుకు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు శిక్షణ పొందారు. రిసోర్స్ పర్సన్ లుగా తణుకు, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు కార్యనిర్వహణాధికారులు వి.కృష్ణచంద్ర రావు,  ఘంటా శ్రీనివాస్, వి.వి.వి ఎస్ రామారావు, విహెచ్ఎస్ జగన్నాథంలు వ్యవహరించారు.

Scroll to Top
Share via
Copy link