ఉండ్రాజవరం మండలం, దమ్మెను గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షతన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ పంచాయతీ బోర్డు సభ్యులకు ఎంపీటీసీ గడ్డం రామకృష్ణ తదితరులను ఘనంగా సత్కరించి రిపబ్లిక్ డే దినోత్సవ జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనదని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం హక్కులు ప్రసాదించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


