గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ శ్రీమతి పాలాటి ఎల్లారీశ్వరి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయ అధికారులు సిబ్బంది వివిధ పాఠశాలల బాల బాలికలు పాల్గొనగా కార్యాలయ ఆవరణలో దేశనేతలు గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రకారం దేశంలో ప్రతి పౌరులకు స్వేచ్ఛ సమానత్వం కల్పించ బడ్డాయని రాజ్యాంగ అమలు జరిగి 77వ సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో వివిఎస్ రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయ శర్మ, మండల విద్యాధికారి సిహెచ్. సక్సేనా రాజు, పంచాయతీరాజ్ ఏఈ ఎన్. ఏడుకొండలు, ఎంపీటీసీలు వేముల వెంకట సత్యనారాయణ గడ్డం రామకృష్ణ కో ఆప్షన్ నెంబర్ షాజహాన్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, మండల వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


