తణుకు డిపో గారేజ్ ఆవరణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమంలలో భాగంగా డిపోమేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని భాగ్యశ్రీ హాస్పిటల్ ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ తక్కిళ్లపాటి పెంచల నరసింహప్రసాద్ చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తణుకు డిపో లోని రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది 80 మందికి బ్లడ్ షుగర్, బి. పి. మరియు ఇ. సి. జి. పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. Dm నిర్వహించిన అవగాహనా సదస్సులో గుండె నొప్పి లక్షణాలు, గుండె నొప్పి రావడానికి కారణాలు, రాకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవలసిన నివారణ చర్యలు సవివరంగా వివరించారు. సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన dm కి, మెడికల్ క్యాంపు నిర్వహించిన డాక్టర్ గార్కి, వారి సిబ్బంది కి డిపో ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, గారేజ్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు రాజులపాటి వెంకటేశ్వరరావు, తులసి శ్రీనివాసరావు, RTC హెడ్ కానిస్టేబుల్ చప్పిడి సత్య సాయిబాబా డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, హాస్పిటల్ PRO చాట్రాజుల నాని, గ్యారేజ్ సిబ్బంది, డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు క్యాంపుకి రాలేకపోయిన సిబ్బంది వారి డ్యూటీ గుర్తింపు కార్డు తీసుకొని ఈ నెల 31 వతేది వరకు హాస్పిటల్ లో ఉచిత OP మరియు ఉచిత మెడికల్ పరీక్షలు చేయించుకునే అవకాశంను డాక్టర్ ఇచ్చారని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు.


