తణుకు, జనవరి 23, 2026 : బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించడం ద్వారా సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారవుతారని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారు నిర్వహిస్తున్న “బాలోత్సవం” సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తణుకులో మూడవ సారి బాలోత్సవం నిర్వహిస్తున్న శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి. ఎల్.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి పి.దక్షిణామూర్తి, కార్యవర్గ సభ్యులందరినీ అభినందించారు.
ముందుగా “బాలోత్సవం” అధ్యక్షులు పి. ఎల్.నరసింహారావు అతిథులకు, ఆహూతులకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి బాలోత్సవం పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన ప్రారంభ సభలో గౌరవ అతిథిగా పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ, తణుకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారు బాలోత్సవం నిర్వహణ ద్వారా బాలలలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలు వెలికితీసి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. బాలోత్సవం వంటి కార్యక్రమాలు విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడానికి ఉపయోగపడతాయని టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు.
బాలోత్సవం ప్రారంభంలో తణుకు పట్టణం, మరియు పరిసర గ్రామాల పాఠశాలల మూడు వేలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులు, పుర ప్రముఖులు, పుర ప్రజలు అందరూ కలిసి “వందేమాతరం” గీతాలాపన చేసారు. ఈ గీతాలాపన గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఒక ధృవ పత్రమును తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే మానవత నాయకులు గమిని రాంబాబు ను, రూట్స్ స్కూల్ అధినేత విద్యాకాంత్ ను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణు గోపాలకృష్ణను, తణుకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ డా. దొమ్మేటి వెంకట సుధాకర్ లను గమిని రాంబాబు దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ సందర్భంగా పైడిపర్రు గ్రామానికి చెందిన శ్రీమతి యన్.వాణీ శ్రీదేవి మనుమరాలు చి.మహాలక్ష్మి మిహిర అత్యుతాష్టకం వల్లె వేసింది. ఆ చిన్నారిని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు.
రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన “బాలోత్సవం” గేయాలకు తణుకు వేమవరంలోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలను బాలోత్సవం కార్యక్రమ నిర్వాహకులు, అతిథులు, పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
కార్యక్రమానికి ప్రముఖ మెజేషియన్, సైకాలజిస్ట్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు గోపి మామ గా సుప్రసిద్ధులు బి.యం.గోపాల రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం ఉప విద్యాశాఖాధికారి డి.మురళీ సత్యనారాయణ, తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సి.హెచ్.యన్.వి. పద్మావతి, తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ డా.దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగు దేశం నాయకులు తాతపూడి మారుతీరావు, గుబ్బల చంద్ర శ్రీనివాస్, ప్రముఖ కంటి వైద్యులు డా.హుస్సేన్ అహమ్మద్, విద్యావేత్త డా.జుత్తిగ చంద్ర ప్రసాద్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండ్ యం.సూర్య ప్రకాష్, సి.ఐ.టి.యు. జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, ఏపీటీఎఫ్ నాయకులు వేండ్ర రామ్ మోహన్, యూటీఎఫ్ నాయకులు టి.జె.జయ కుమార్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎస్.ఐ. బోడపాటి ప్రసాద్, బాలోత్సవం కోశాధికారి ఏ.ఎస్.వి. శేషుబాబు, మానవత నాయకులు ఆలపాటి సుబ్బారావు, రిటైర్డ్ అధ్యాపకులు పి.నిరీక్షణ రాజు, రిటైర్డ్ ఆంగ్ల భాష ఉపాధ్యాయులు గజ్జరపు వెంకటేశ్వర రావు, రిటైర్డ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సి.హెచ్.త్రిమూర్తి రాజు, తెలుగు భాష ఉపాధ్యాయులు సి.హెచ్. వి. కృష్ణ ప్రసాద్, ఆంగ్ల భాష ఉపాధ్యాయిని శ్రీమతి యం.నీలవేణి ప్రభృతులు పాల్గొన్నారు.


