యువగళం పాదయాత్రతో అన్ని వర్గాలకు లోకేష్ అండ

తణుకులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

తణుకులో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించిన యువత

యువగళం పాదయాత్ర ద్వారా 3,400 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించిన మంత్రి నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన పురస్కరించుకొని శుక్రవారం తణుకు నియోజకవర్గం వ్యాప్తంగా పరి సేవా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరి చేసే విధంగా మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎన్నో భారీ ప్రాజెక్టులను రాష్ట్రంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గర్తించుకోవాలని కోరారు. లోకేష్ జన్మదినం పురస్కరించుకొని తణుకులో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు 80 శాతం మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును కాపాడాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రణాళికలు చేశారని చెప్పారు. యువత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కుటుంబాలకు అండగా నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలోరాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link