వైసిపి ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తి

గ్రామాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన గత పాలకులు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు

ఇరగవరం మండలంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే

గత వైసిపి ప్రభుత్వం కమిషన్ల కోసం పనులు చేసి  కనీసం అభివృద్ధి అమలు చేయలేని దుస్థితి ఉండేదని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గ్రామంలో జలజీవన్ పనుల పేరు చెప్పి రోడ్లను తవ్వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని గుర్తు చేశారు. కమిషన్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేదానికి కేతావారిపాలెం ఒక నిదర్శనమని అన్నారు. ఇరగవరం మండలం కేతావారిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ  గ్రామంలో గతంలో ప్రజలు విద్యుత్ సమస్యలు ఎదుర్కొనే వారని ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరించాలని గుర్తు చేశారు. లో వోల్టేజీ సమస్య పరిష్కారంతోపాటు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే వేసవికాలంలో సైతం విద్యుత్తు సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రణాళికలు చేపట్టామని అన్నారు. గతంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామాన్ని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసి రోడ్లు తవ్వేసి వదిలేసారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రోడ్లు నిర్మాణం చేసి, డ్రైనేజీ అభివృద్ధి చేసి, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి మరింత సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link