ఉండ్రాజవరం గ్రామంలో ఉమా వరుణ్యేశ్వరస్వామివారి ఆలయ కల్యాణమండపంలో రామాలయం వద్ద మంగళవారం ఉండ్రాజవరం మండల బిజెపి అధ్యక్షులు కె.బాలాజీ అధ్యక్షతన ఉండ్రాజవరం మండలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షులుగా నితిన్ నబీన్ నియమితులైన సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నితిన్ నబీన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వర్లు, కే. సత్యనారాయణ, జిల్లా నాయకులు అక్కిన గోపాలకృష్ణ, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు పి. మాణిక్యాలరావు, మండల బిజెపి నాయకులు డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణ, ఆకెళ్ళ శ్రీనివాసరావు, పి. సాయిబాబా, ఎన్. చిన్న రాము, కే.రామకృష్ణ, బి.దుర్గాప్రసాద్, ఎం. నాగేశ్వరావు, ఎం. వెంకటేశ్వరరావు, ఏం. నరసింహమూర్తి, జె.సత్యనారాయణ, కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


