అత్తిలి మండలం కిన్నెర పురం గ్రామంలో పొలం పిలుస్తుంది మంగళవారం మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నందున కాంప్లెక్స్ ఎరువులు మొత్తం కూడా దమ్ములోనే వెయ్యాలని సూచించారు. అదేవిదంగా పల్లపుచేలల్లో సల్ఫర్ అధికంగా ఉండే ఎరువులు వాడవద్దని, అలాగే ప్రస్తుతం ఊడ్చిన చేలల్లో మూన తిరిగిన తర్వాత లేత ఆకుల్లో ఎరుపు రంగు మచ్చలు కనిపించినట్లయితే రైతులు జింకులోపంగా గుర్తించి చిలేటెడ్ జింక్ స్ప్రే చేయాలని రైతులకు తెలిపారు. అలాగే అవసరం మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని ఎక్కువగా యూరియా వినియోగించినట్లయితే వరి మొక్క మెత్తబడి పురుగులు తెగుళ్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


