పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం రేలంగిలో ఎన్టీ రామారావు 30 వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్.పి.టి.సి. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, ప్రపంచంలో తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి, కళ, రాజకీయ రంగాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక ఘనుడు, మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గూడూరి నాగరాజు గ్రామ టిడిపి అధ్యక్షులు కామన రాంబాబు జనసేన సెక్రెటరీ మంగిన శ్రీనివాస్ బిజెపి నాయకులు ఆకుల సుబ్బారావు, ఎక్స్ ఎంపీటీసీ కామన ఏడుకొండలు, చిలిఅశోక్, పాతూరి వెంకట్రావు, షేక్ బాషా, గుడాల శ్రీను, పసుపులేటి నాగన్న, గాలింకి రమేష్, రవికాంత్, చదరం చిట్టప్పారావు, సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


