జనవరి 19వ తేదీన ప్రజా కవి, సహజ కవి, తాత్వికుడు శ్రీ యోగి వేమన జయంతిని ఈ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక క్యాలెండర్లో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి, ఉపాధ్యక్షులు ద్వారపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ,
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, శ్రీ యోగి వేమన జయంతిని జనవరి 19 న అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని అన్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ. విడుదల చేసి, జనవరి 19న అన్ని జిల్లాల్లో శ్రీ యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
శ్రీ యోగి వేమన తత్వం తెలియని తెలుగువారు ప్రపంచంలో ఎవరూ లేరని, సామాన్య ప్రజలకు సులభమైన పద్యాల ద్వారా సమాజానికి జీవన మార్గదర్శనం చేసిన మహనీయుడు యోగి వేమన అని కొనియాడారు. అటువంటి మహానీయుడి జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరిగిందని, దీనికి అనుగుణంగా రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తాడి భీమారెడ్డి పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో శ్రీ యోగి వేమన తత్వం రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమమైందని అన్నారు. తణుకు పట్టణంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాలకృష్ణ రెడ్డి ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి.తణుకు రెడ్డి సంఘం అధ్యక్షులు తమలంపూడి వెంకటరెడ్డి. తణుకు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కర్రీ రామచంద్రారెడ్డి. మేడపాటి విజయ రెడ్డి.వెలగల భాస్కర్ రెడ్డి చింత ధర్మవీర నారాయణరెడ్డి కొవ్వూరి వెంకట్ రెడ్డి, సత్తి వెంకట రెడ్డి, ఒ.జి.ఆర్. రెడ్డి, పులగం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ యోగి వేమన జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఈ చారిత్రక నిర్ణయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం, తణుకు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం కృతజ్ఞతలు తెలుపుతోంది.


