తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్వర్యంలో నియోజకవర్గంలో పలుగ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్.టి.ఆర్. వర్ధంతిని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో టిడిపి నాయకులు ఎన్.టి.ఆర్. వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి చెరువు గట్టు జెండా దిమ్మ వద్ద పూలమాలలు నివాళులర్పించిన మండల టి.డి.పి నాయకులు కుదప చక్రపాణి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ (భాను), నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


