తణుకు ఎస్. కె. ఎస్. డి మహిళా కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలలో భాగంగా మజా కంపెనీ వాళ్ళు ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థసులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు అందరూ ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని చక్కని రంగవల్లులను కళాశాల ప్రాంగణంలో తీర్చిదిద్దారు. ఈ పోటీలలో ఇంటర్ నుంచి వి.జె.డి. పార్వతి, ఎస్. గ్రీష్మ, టి.దీక్షిత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. డిగ్రీ నుంచి పి. దుర్గాదేవి, వి. గాయత్రి, జి. హన్సిక లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థములకు మజా కంపెనీ ఆద్వర్యంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్స్ పాల్స్, అద్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


