తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం

-: మంత్రి కందుల దుర్గేష్

పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని ఎస్.ఎన్.పి. జెడ్పీ హైస్కూల్ లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 3.0)లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

ఉపాధ్యాయులు, విద్యార్ధులు,తల్లిదండ్రులతో మంత్రి దుర్గేష్ ముఖాముఖి

మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన అద్భుతమని ప్రశంస

విద్యార్థుల్లో నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడి

నిడదవోలు: విద్యార్థుల్లో నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శుక్రవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని ముక్కామల గ్రామంలో ఉన్న ఎస్.ఎన్.పి. జెడ్పీ హైస్కూల్ లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 3.0)లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థులకు స్వయంగా మంత్రి దుర్గేష్ మధ్యాహ్న భోజనం వడ్డించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందించి అభినందించారు.విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికనుగుణంగా ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రోగ్రెస్ కార్డులను చూసి విద్యార్థుల అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏమవ్వాలో తెలుసుకొని సంబంధిత మార్గదర్శకత్వం అందించారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రూపొందించిన చార్ట్ లను, ప్రయోగాలను పరిశీలించి ప్రశంసించారు. అనంతరం చిన్నారులతో కలిసి మంత్రి దుర్గేష్ సెల్పీలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మెగా పేటీఎం 3.0లో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

విద్యావ్యవస్థలో వినూత్న ఆలోచనలు..విప్లవాత్మక సంస్కరణలకు నాంది:మంత్రి కందుల దుర్గేష్

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖకు పెద్దపీట వేశామన్నారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేసి తద్వారా వారిలో మానసిక వికాసంతో పాటు విద్యార్థుల అభిరుచులకనుగుణంగా వారికి తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య అనుసంధానం కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుత ఆలోచన నుండి పుట్టిన కార్యక్రమమే ఈ మెగా పీటీఎం 3.0 అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా పీటీఎం సమావేశాలు అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు నిర్వహించిన పీటీఎంలు విజయవంతం అయ్యాయన్నారు. అన్ని సబ్జెక్టుల్లో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమమిది అని తెలిపారు.పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి.తరగతి గదిలో, బడిలో వారి నడవడిక ఎలా ఉంది. ఇంట్లో ఎలా ఉంటున్నారు. వారి బంగారు భవిష్యత్తుకు ఏం చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందో చర్చించేందుకు ఇది సరైన వేదిక అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. విద్యార్ధులకు చదువుతో పాటే నైతిక విలువలు బోధించడం శుభ పరిణామమన్నారు. మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు సైతం యూనిఫాంలు ఇచ్చామన్నారు.తద్వారా ఐకమత్యం, సారుప్యత, అందరూ సమానమేనన్న భావన పెరుగుతుందన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామన్నారు.ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ ప్రవేశపెట్టామని వివరించారు. కుటుంబంలో అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం క్రింద రూ.15000 నగదు జమ చేస్తుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గి చేరికల శాతం పెరుగుతోందన్నారు.దీన్ని మొక్కుబడి కార్యక్రమంగా తీసుకోవద్దని అన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తేనే కార్యక్రమ లక్ష్యం సాధించగలుగుతామన్నారు.కార్యక్రమాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ ప్రయత్నం పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.

పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలగాలి:మంత్రి కందుల దుర్గేష్

పిల్లలకు తమకన్నా మెరుగైన జీవితం ఇవ్వాలన్నది ప్రతి తల్లిదండ్రుల కల అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఆ కల సాకారం కావాలంటే వారి ప్రతిభను నిరంతరం గమనిస్తుండాలన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం విద్యార్థిలో లోపం ఎక్కడ ఉందో గమనించి వెంటనే సరిచేయాలని సూచించారు. చదువుతో పాటు ఆటలు,పాటలు కూడా ఉండాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని తెలిపారు. విద్యార్ధులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాల్సిన అవసరముందన్నారు. సమాజంలో విపరీత ధోరణులు పెచ్చుమీరుతున్న తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.చీకటి నుండి వెలుగు వైపు నడిపించి అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన కాంతులు ప్రసరించేది గురువు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.చదువు పట్ల పిల్లల్లో ఆసక్తి,వారిలో దాగున్న నైపుణ్యాలు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పితేనే వ్యసనాల బారిన పడరన్నారు.

తరగతి గదిలో విద్యార్థి భవిష్యత్తు నిర్మాణం:మంత్రి కందుల దుర్గేష్

దేశాభివృద్ధి, సమాజ నిర్మాణం, విద్యార్థుల భవిష్యత్, మానవ విలువలు, మూర్తిమత్వం, ప్రజ్ఞ, మానవత్వం, సామాజిక స్పృహ, సృజనాత్మకత, ఓర్పు, నేర్పు ఇలా ప్రతీ అంశం గురువుల ద్వారా విద్యార్థులకు తరగతి గదిలోనే బోధపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. క్రమశిక్షణాయుతమైన విద్యార్థులుగా ఎదిగేందుకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు పునాదులని, ఇక్కడే విద్యార్థులు ప్రతి అంశాన్ని బాగా చదవాలన్నారు. ఉన్నత రంగాల్లో రాణించాలన్నా, బాధ్యతలను, కర్తవ్యాలను అలవరచాలన్నా తమ శక్తి యుక్తులను ధారబోసి ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తారన్నారు. వీటన్నింటిని నమ్మిన కూటమి ప్రభుత్వం సంబంధిత అంశాలపై దృష్టిపెట్టిందన్నారు. పాఠశాలకు పంపడమే కాదు పాఠశాల నుండి వచ్చిన అనంతరం విద్యార్థులు చదువుతో పాటు ఏం నేర్చుకున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే, ఎదగాలంటే, ఆరోగ్య పరంగా వృద్ధిలోకి రావాలంటే టీచర్లకు, తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉండాలన్నారు. ఇరువురు కలిసి విద్యార్థులను వృద్ధి లోకి తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ ఇరువురి మధ్య సరైన అనుసంధానం లేకపోతే పిల్లలను సమగ్రంగా తీర్చిదిద్దలేమని అనేక సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు.వీటన్నింటిని పట్టించుకోకుండా కేవలం పార్టీ రంగులు వేసుకున్న ప్రభుత్వాలను చూశామన్నారు.పిల్లల్లోని కళలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇవ్వాలి అన్నారు.ఈ సందర్భంగా క్రీడలు, వ్యాసరచన, పాటలు, నాట్యం, డిబేట్స్ ఇలా వివిధ విభాగాల్లో ఒక్కో విద్యార్థి ఆసక్తిని బట్టి తర్పీదు ఇస్తే వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేసిన వారవుతామన్నారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణమవుతుందన్నారు.ఆధునిక సమాజంలో బాలల హక్కులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పిల్లల్ని దండించకుండా మంచి మార్గంలోనే మంచిని బోధించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్నిప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తున్నారని రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు తెస్తామన్నారు.

మాక్ అసెంబ్లీలో సత్తా చాటిన పమ్మి దీపికకు మంత్రి కందుల దుర్గేష్ అభినందన

మెగా పేటీఎం కార్యక్రమంలో భాగంగా అతిథులకు స్వాగతం అంటూ నృత్యం చేసిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ వారికి కళల్లో మరింత తోడ్పాటు అందించేందుకు సాంస్కృతిక శాఖ తరపున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గం ఖండవల్లి జెడ్పీ హెచ్ ఎస్ లో చదువుతున్న పమ్మి దీపిక కు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తనదైన శైలిలో సత్తా చాటినందుకు ప్రశంసించారు. సమాజంలో మార్పు కోసం భవిష్యత్ లో ప్రజాప్రతినిధిగా అవ్వాలనుకుంటే తమ ఆశీస్సులు ఉంటాయని దీవించారు.

పెరవలి మండలం ముక్కామల గ్రామం అభివృద్ధికి సహకరిస్తాం:మంత్రి కందుల దుర్గేష్

విద్యార్థులకు ఉపయోగపడేలా పెరవలి నుండి ముత్యాలవారిపాలెం వరకు రోడ్డు నిర్మించాలని పలువురు కోరారని, సంబంధిత రహదారిని ఇప్పటికే మంజూరుచేయించానని, టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని మంత్రి దుర్గేష్ వివరించారు. ముక్కామల గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ లు నిర్మించాలన్న కోరికను త్వరలోనే నెరవేరుస్తానన్నారు. గ్రామ, మండల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link