గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
రేలంగిలో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలు తీసుకువచ్చి విద్యావ్యవస్థను బలోపేతం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం రేలంగి జడ్పీ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విద్యార్థులకు వెలుగులతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆరు నెలల పాటు సమీక్షలు చేసి ఉత్తమ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేసిన కృషిలో భాగంగా 17 నెలల వ్యాధులలోనే విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనిని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరికి కోడిగుడ్డుపై సైతం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని ఆనందం పొందే వారిని ఎద్దేవా చేశారు. విద్యావ్యవస్థలో ఎంతోమంది సేవలు అందించి, సమాజంలో ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తుల పేర్లు వేయాలని ఉద్దేశంతో డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు ఆమె పేరు పెట్టడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యాసామాగ్రిపై సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రంలోసుపరిపాలన అందించే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి సంక్షేమం,అభివృద్ధి సమపాళ్లలో అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను 90 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మరో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అనుభవాన్ని చూసి సిబిఎన్ అనే బ్రాండ్ తో అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తొలుత స్కూలులో డైనింగ్ హాలును ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన భోజనం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


