ప్రేమ, పోరాటాల కలబోత మోగ్లీ (2025)
హీరో రోషన్ కనకాల
విశాఖపట్నం: డిసెంబర్ 3 (కోస్టల్ న్యూస్)
యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా, విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ (2025)’ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ ఈరోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మా ‘మోగ్లీ’ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్. ఒక సాధారణ యువకుడిగా, నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా, దర్శకుడు సందీప్ రాజ్ విజన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి, మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారు అన్నారు. విశాఖపట్నం పాడేరు, పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో హర్ష కామెడీ, కాళ భైరవ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. ‘మోగ్లీ’ అనేది కేవలం సినిమా కాదు, యువత ఫీల్ అయ్యే కథ. ఇదొక ప్రేమ యుద్ధం అని డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.” అని అందరూ ఆదరించాలని కోరారు. విశాఖపట్నం అంటే తమకి సెంటిమెంట్ అని అందుకే ప్రమోషన్ విశాఖ నుండే ప్రారంభించాం అన్నారు. అనంతరం హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ ”విశాఖపట్నం నాకు చాలా ఇష్టమైన ప్లేస్. మా ‘మోగ్లీ’ ప్రమోషన్స్ ఇక్కడ మొదలవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాది డెఫ్ అండ్ మ్యూట్ అయిన అమ్మాయి పాత్ర. మాటలు లేకపోయినా, కళ్లతోనే భావాలను పలికించాల్సి వచ్చింది. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్ రోషన్, సందీప్ చాలా సపోర్ట్ చేశారు. ట్రైలర్లో చూసిన ఇంటెన్సిటీతో పాటు, సినిమాలో అందమైన లవ్ స్టోరీ మరియు గొప్ప ఎమోషన్ ఉంటుంది అన్నారు. కమెడియన్ హర్ష చెముడు మాట్లాడుతూ ”నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కేవలం నవ్వించడం కోసమే కాకుండా, హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ సినిమా కథ చాలా సీరియస్‌గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా నా పాత్ర ద్వారా కామెడీ డోస్ కొంచెం లైట్ చేస్తుంది. చాలా మంచి కథ కుదిరింది. డైరెక్టర్ సందీప్ రాజ్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. తప్పకుండా థియేటర్లలో నవ్వుకుంటారు, అలాగే ఏడుస్తారు కూడా “అంత బావుంటుంది సినిమా అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి కమెడియన్ హర్ష చెముడు పాల్గొన్నారు.


