తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టు హాలులో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు శ్రీమతి డి. సత్యవతి ఇతర న్యాయమూర్తులచే డిసెంబర్ 13వతేది కోర్టులు పనిచేయు ప్రతిచోట జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు రాజీచేయుట గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులుతో మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఎక్కువ కేసులు రాజీ చేయటానికి తమవంతు కృషి చేయాలని, చిన్న చిన్న తగాదా విషయాలలో రాజీయే రాజమార్గమని, చిన్న చిన్న తగాదాలు పరిష్కరించుకుని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనొట్ కేసులు, కుటుంబ తగాదా కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులుగా బ్యాంకు బకాయిలు, టెలిఫోన్ బిల్లు బకాయి కేసులు రాజీ చేసుకోవాలని, కోర్ట్ లలో కేసులు పెండింగ్ ఉన్న వారు డిసెంబర్ 13వతేది రాష్ట్రం మొత్తము మీద జరుగు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డి. సత్యవతి, చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, కే. కృష్ణ సత్యలత, సీనియర్ సివిల్ జడ్జి, సాయిరాం పోతార్లంక, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, కే. కృష్ణవేణి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు బెంచ్ కోర్ట్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, వివిధ పోలీసు స్టేషన్లు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


