అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు గణపతి సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వలరాంబాబు ఆధ్వర్యంలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా సమాజం ప్రోత్సహించాలని 1992లో UNO డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంఏటా జరపాలని ప్రకటించిందని సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి వైకల్యాన్ని కలుపుకొని ఉన్న సమాజాలను పెంపొందించడం అభివృద్ధి చెందుతున్న సమానమైన సమాజాలను రూపొందించడంలో వికలాంగులు పోషించే పాత్ర ముఖ్యమైనదని అని రాంబాబు ప్రశంసించారు వికలాంగులుగా జన్మించనీ సమాజం కావాలని అందుకు ప్రతి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఉన్న రుగ్మతలు మూఢ నమ్మకాలు మేనరిక వివాహాలు రద్దు చేయాలని వైద్య ఆరోగ్య సమస్యలు వ్యక్తిగతంగా ప్రభుత్వాలు చూడకుండా వికలాంగులు లేని సమాజంగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు అనంతరం జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలీ శివ కార్యదర్శి వంగా కృపానంద వర ప్రసాద్ షబీనాలు కేక్ కట్ చేస్తూ ఆనందాన్నివ్యక్తం చేశారు ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా విశేష సేవలను అందిస్తున్నందుకు డాక్టరేట్ పొందిన ర్యాలీ శివకు ఏపీ NHM ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దిద్దే దయామణి జన విజ్ఞాన వేదిక నాయకులు మదర్ థెరసా అవార్డు గ్రహీత వంగా కృపానంద వర ప్రసాద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దయామణి Y పైడియ్య, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దొర బాబు, మునుకుటి బాలాజీ రమేష్, షబీన, భవానీ, వాజిద్, సుధాకర్, దేవయ్య. బంగారు బాబు, ఉమా మహేశ్వరరావు, మంగ, ఒబేద్య, మార్క్, G ప్రసన్న, టీ చిరంజీవి, సాయి రమణ, సుబ్రహ్మణ్యం, బి నాగేశ్వరరావు, K చందురాజు టీ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.


