డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉండ్రాజవరం మండలంలో మోర్త నెంబర్ వన్ స్కూల్ భవిత స్కూల్ నందు నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.ఏ.సి.ఎస్. చైర్మన్ & పిఎల్వి కాకర్ల నరసన్న (నాని). ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఆటలు పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ యొక్క దివ్యాంగ బిడ్డలను చూసుకుని తల్లిదండ్రులు అధైర్యపడవలసిన పనిలేదని ప్రభుత్వం వారి నుంచి అందవలసిన ఉపకార వేతనాలను అలాగే వారి యొక్క సంరక్షణకు సంబంధించి విషయాలపై ఇప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి మీకు అందుబాటులో ఉంటానని పిఎల్వి కాకర్ల నరసన్న (నాని) అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషన్(1) అధికారి సక్సేనా రాజు, మండల ఎడ్యుకేషన్(1) అధికారి శ్రీమతి శారదా జ్యోత్స్న ఉపాధ్యాయులు భాను, ఎల్.ఆర్. మూర్తి, కట్టా శ్రీనివాస్, పర్సన్స్ సాగర్, యామిని, మీడియా మిత్రులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగినది.


