సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలోని వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు దేవస్థాన అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆయన నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్దికీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ టిడిపి నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, ఆల్ ఇండియా చిరంజీవి ఫాన్స్ వైస్ ప్రెసిడెంట్ కటకం రామకృష్ణ, మండల టిడిపి అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, నిడదవోలు ఏ.ఎం.సి.బోర్ద్ మెంబర్ హనుమంతు వెంకన్న, ఉత్సవకమిటీ అధ్యక్షుడు బలగం సతీష్, జనసేన నాయకులు పసుపులేటి ఇంద్ర, హనుమంతు పండు, బండారు రాము తదితరులు పాల్గొన్నారు.


