సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలి

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

నియోజకవర్గ ప్రజలకు షష్టి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పురస్కరించుకొని అత్తిలిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలో ఇరగవరం మండలం ఐతంపూడి పేకేరు రాపాక గ్రామాల్లోని దేవాలయాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో కొనసాగాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link