తణుకులో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం

రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 25 వ వార్డులో వున్న అంగన్వాడీ కేంద్రం లో పిల్లల తల్లితండ్రులకు అవగాహన సదస్సు నిర్వహిస్తూ శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలా స్వేచ్ఛగా, కులాలకు, మతలకు అతీతంగా ఉండాలన్నదే రాజ్యాంగ ఉద్దేశమని, మహిళలు కట్నానికి వ్యతిరేకంగా పనిచేయాలని కట్నం ఇవ్వటం, తీసుకొనుట నేరమని, ఎంతో మంది కట్న దాహానికి బలై పోతున్నారని, చట్టం మహిళలకు అనుకూలంగా ఉందని సమస్య ఎదురైతే మనోవర్తి, డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు వేసి న్యాయం పొందవచ్చని, మండల న్యాయ సేవల కమిటీ తణుకు వారు అందించు ఉచిత న్యాయసహాయం సేవలు పొందవచ్చని తెలిపారు. ఇందులో శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్ శ్రీ దూలపల్లి బ్రహ్మాజీ మరియు రామలక్ష్మి పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link