దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని, దాని విలువలను విద్యార్థులుకు బోధించాలని ప. గో. జిల్లా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ డి. వి. వి. యస్. వర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక యస్. సి.ఐ. యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అధ్యాపకులు- ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలు నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవం లో పాలుపంచుకుని సామూహికంగా “ రాజ్యాంగ పీఠిక పఠనం- పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత రాజ్యాంగ దినోత్సవం పై ప్రచురించిన దారి దీపం ప్రత్యేక సంచికను కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఏడుకొండలు ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని స్థూలంగా పరిచయం చేసే ఈ ప్రత్యేక సంచిక అందరికీ దారి దీపం గా ఉపకరిస్తుందని అన్నారు. తొలుత కళాశాల అధ్యాపకులు ఎన్ విష్ణువర్ధన్ స్వాగతంతో ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రచారవేదిక సభ్యులు డా. రమేష్ చంద్రబాబు, విశ్రాంత ప్రిన్సిపాల్స్ సంకు మనోరమ, అడ్డాల సత్యనారాయణ, పేరూరి మురళీ కుమార్, పి దక్షిణామూర్తితోపాటు చల్లా హైమావతి, కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈసభలో వివిధ పౌరసమాజ ప్రతినిధులు సీనియర్ సిటిజన్ సంఘం కరుణాకర చౌదరి, మానవత సుబ్బారావు, లయన్ చీకటి శ్రీనివాసరావు, ఎఐటియుసి కోనాల భీమారావు, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, పి సీతారామరాజు, సంపత్ కుమార్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు .


