ఉచిత కంటి వైద్యశిబిరం ద్వారా పేదలకు సేవలు

663 మందికి కళ్లజోళ్లు, 47 మందికి శస్త్రచికిత్సలు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తణుకు పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఇప్పటి వరకు 663 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతోపాటు 47 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండాల నుంచి సుమారు 2 వేల మంది ఈ వైద్యశిబిరంలో పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంతి పవన్‌కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నారా లేకేష్‌ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసికెళుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించడంతోపాటు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు.

Scroll to Top
Share via
Copy link