తణుకు పురుషుల శాఖా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవం

తణుకు, నవంబర్ 20, 2025 : దాతల సహకారంతో తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఉదయం, గత వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.

సభలో అతిథిగా పాల్గొన్న స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, గ్రంథాలయాలు సందర్శించి విజ్ఞానం సంపాదించాలని హితవు పలికారు.

సభలో అతిథులుగా తణుకు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు, తణుకు పట్టణ జనసేన అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసు, తణుకు పట్టణ బి.జె.పి. అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, తారకాపురి లయన్స్ క్లబ్ డైరెక్టర్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బెజవాడ రామ సూర్యారావు (సూరి), తణుకు మానవత సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజ రాజేశ్వరరావు, ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్, మానవత జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.వి.సతీష్ బాబు, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు వేదికను అలంకరించారు.

గ్రంథాలయంలో కుర్చీలు కొనుగోలు నిమిత్తం ఐదువేల రూపాయలు దానం చేసిన దాత శ్రీమతి జవ్వాది లక్ష్మి ని గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రంథాలయాధికారి సత్కరించారు.

గత వారం రోజులుగా, వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం, నీతి కథలు, వక్తృత్వం, దేశ భక్తి గేయాల పోటీలలో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రముఖులందరూ వారి చేతుల మీదుగా జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పుస్తకములు, పెన్నులు బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశ భక్తి గేయాలు ఆలపించారు.

ఈ వారోత్సవాల ముగింపు సభలో సినీ గేయ రచయిత్రి శ్రీమతి పప్పొప్పు విజయలక్ష్మి మొత్తం నూట యాభై పుస్తకాలు గ్రంథాలయానికి బహుమతిగా అందజేశారు.

కార్యక్రమంలో చివరిగా కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు లను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు, అతిథులు దుశ్శాలువాలు, జ్ఞాపకాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, మానవత నాయకులు ఆలపాటి సుబ్బారావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ తెలుగు పండితులు వాడపల్లి విశ్వేశ్వరరావు, లైబ్రేరియన్ గుత్తికొండ కృష్ణారావు భార్య శ్రీమతి గుత్తికొండ స్రవంతి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి మునుకుట్ల ఉమా జ్యోతి, సినీ గేయ రచయిత్రి శ్రీమతి పప్పొప్పు విజయలక్ష్మి, ప్రముఖ కవి వి.ఎస్.వి. ప్రసాద్, ప్రముఖ కవయిత్రి శ్రీమతి జవ్వాది లక్ష్మి, పి యం పి డాక్టర్ ఎస్. శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ రాగాల పృథ్వీ నారాయణ ప్రభృతులు, చదువరులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బహుమతులు కొనుగోలు చేయు నిమిత్తం ఆర్థిక సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వావిలాల సరళాదేవి, తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, ప్రముఖ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ ప్రభృతులను, గ్రంథాలయానికి కుర్చీలు కొనుగోలు చేయు నిమిత్తం ఆర్థిక సాయం చేసిన శ్రీమతి జవ్వాది లక్ష్మి లను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మరియు గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, వారి భార్య శ్రీమతి గుత్తికొండ స్రవంతి అభినందించారు.

Scroll to Top
Share via
Copy link