గంజాయి అక్రమ రవాణాపై కఠినచర్యలు

తణుకు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా, 24 తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండయ్య ఆధ్వర్యంలో కొండాలమ్మ పుంతరోడ్డులో కొంతమంది వ్యక్తులు నిషేధిత గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారం అందింది.

తదనుగుణంగా సి.ఐ., టౌన్ ఎస్ఐ కె. శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఏడుగురు వ్యక్తులు గంజాయి కవర్లతో ఉండగా, పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పట్టుకుని, వారి వద్ద నుండి 4.350 కిలోల నిషేధిత గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ముద్దాయిల వివరాలు:

  1. పాలాడి భాను ప్రకాష్, పాలంగి
  2. కాకరపర్తి బాలాజీ, తణుకు
  3. కాకరపర్తి గణపతి, అజ్జరం
  4. పితాని విజయబాబు, నల్లకులవారిపాలెం
  5. గుబ్బల ఉదయ్ ప్రసాద్ @ ఉదయ్, తణుకు
  6. బొడ్డు షారోన్, తణుకు
  7. ఖండెటి సత్యనారాయణ @ సత్య, తణుకు
  8. అరెస్ట్ అయిన ముద్దాయిలను తణుకు కోర్టు ముందు హాజరు పెట్టగా 15 రోజులు రిమాండ్ విధించడమైనది.
  9. కేసు చేధించిన తణుకు టౌన్ పోలీస్ సిబ్బందిని మరియు సహకరించిన ఐ.టి. కోర్ సిబ్బంది ఎస్.ఐ. రవికుమార్, పి.సి. భాస్కర్ లను పశ్చిమ గోదావరిజిల్లా ఎస్.పి., తాడేపల్లిగూడెం డి.సి.పి. అభినందించినారు.
Scroll to Top
Share via
Copy link