తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాలులో మహిళా చట్టాలపై జరిగిన అవగాహనా సమావేశంలో శనివారం తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు డి. సత్యవతి ఆదేశముల మేరకు తణుకు న్యాయమూర్తులు కె.కృష్ణసత్యలత, సీనియర్ సివిల్ జడ్జి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణవేణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్. రంజిత్ కుమార్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి మహిళ విద్యావంతురాలై ఉండాలని తెలిపారు, బాల్యవివాహలు అనర్థాలు, పొక్సో చట్టం, మహిళలు అక్రమరవాణా, లైంగిక వేధింపుల చట్టం, మండల న్యాయ సేవల సంస్థ చట్టం, ఉచిత న్యాయసహాయం సేవలు గురించి తెలియచేసారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమస్యలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులుతో పాటు ఆదర్శ మహిళ మండలి స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పారినాయుడు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, పి.శ్రావణి సమీరా, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సంఘసభ్యులు ఊభా శాంతి, శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.


