మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా గోవధ జరుగుతున్న, అనుమతులు లేకుండా లేహ్యం ఫుడ్ ప్లాంట్ నేటికీ నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో పార్టీలకు అతీతంగా ప్రజలు రాజకీయ నాయకులు గోసంరక్షకులు ఉద్యమం చేసిన ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు ఆ సంస్థను నడిపిస్తూనే ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించి ఇటీవల వైజాగ్ ఎయిర్ పోర్టు నుండి 11 కంటైనర్లు లో మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే సెంట్రల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీం అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ టీం ఆ మాంసాన్ని సీజ్ చేసి పరీక్షకు పంపితే మూడు కంటైనర్లలో గోమాంసం ఉందని నిర్ధారణ అయిందని, ఇక్కడ సంస్థలో పనిచేసే వెటర్నరీ డాక్టర్లను ఆ విషయమై వైజాగ్ పంపడం జరిగిందని, ఒకపక్క కూటమి ప్రభుత్వం బిజెపి నాయకులు సనాతన ధర్మం అంటున్నారని గోవులను వధిస్తే ఉపేక్షించేది లేదని అంటున్నారని, ఇక్కడ తణుకులో మాత్రం ఎంపీ ఎమ్మెల్యేలు పూర్తి సహకారం అందిస్తూ గోవులను వధించే కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారని తాము మోత్తుకుంటూనే ఉన్నామని, పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు దుర్గంధం భరించలేకపోతున్నామని విన్నవించుకున్న ప్రభుత్వం నిలుపుదల చేసే ప్రయత్నం చేయలేదని అన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బస్సులలో తరలివెళ్లి వినతి పత్రాలు అందించినా కూడా నేటికీ గోవధ జరుగుతూనే ఉందని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అదేవిధంగా పైడిపర్రు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా గ్రామ సంచారం చేస్తూ బ్రతుకుతున్న ఆంబోతును కూడా వదించేసారని, అలాగే తణుకు పట్టణంలో పరిసర ప్రాంతాలలో ఎన్నో గోవులను అపహరించుకుపోయి ఈ ప్రాంతంలో గోహత్యలు చేస్తున్నారని అన్నారు. సెంట్రల్ టీమ్ వారు గోమాంసమని నిర్ధారణ చేసినా కూడా ఇక్కడ గోహత్యలు ఆగటం లేదని అన్నారు. ఆ విధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఈ ప్రాంత ప్రజలకు గోహత్య దోషం పట్టుకుంటుందని ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న ఆపడం లేదని కారుమూరి అన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి గోహత్యలను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


