తణుకు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్బంగా తణుకు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్ర లకు ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు తెలియచేసా రు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2,9,16 తేదీ లలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరి కార్తీక సోమవారం నాడు దర్శనాలు అనంతరం తణుకు చేరుతాయని సూపర్ లక్సరీ టికెట్ ధర 1200/- అని, 40 మంది భక్తులు ఉంటే వారు కోరిన రోజు వారి దగ్గరకు అద్దె ప్రాదిపదికన బస్సు లు ఏర్పాటు చేస్తామని, అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్ర స్పెషల్స్ ఏర్పాటుచేశామని సూపర్ లక్సరి కి 6 రోజుల యాత్ర కు 5,500/-, 7 రోజుల యాత్ర కు 6,000, 9 రోజుల యాత్రకు 7,100/-, మరియు స్టార్ లైనర్ స్లీపర్ కు 6 రోజుల యాత్రకు 7,500/-, 7 రోజుల యాత్రకు 8,300/-, 9 రోజుల యాత్రకు 9,700/-, అని ఒకే పీఠం నుండి బస్సు బుక్ చేసుకుంటే గురుస్వామికి ఉచితం అని, అలాగే ఏకాదశ రుద్రుల దర్శనం, అష్ట సోమేశ్వర ఆలయాలు దర్శనం, శ్రీశైలం, భద్రాచలం, ఇతర పుణ్యక్షేత్రంలకు, మన్యసీమ దర్శనం, విశాఖ విహారయాత్ర, పేరుపాలెం బీచ్ ఇతర విహార యాత్రలకు అద్దె ప్రదీపదికన మీరు కోరిన చోటు నుండి మీకు కావలసిన బస్సులు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశం ను తణుకు పరిసర ప్రాంత భక్తులు మరియు విద్యా ర్డులు, వ్యాపారస్తులు ఈ అవకాశం ను ఉపయోగించుకోవలని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా గోడపత్రికలను, ప్రచారకరపత్రాలను ఆవిష్కరించారు. ప్రచారరధంను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, గారేజ్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్, సిస్టమ్ ఇంచార్జి కొమ్మాకుల సాయికుమార్, ఉద్యోగులు కోరాడ దుర్గాప్రసాద్, షేక్ లాల్ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link