శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఉచిత యోగా శిక్షణా తరగతులను గురువారం తణుకు, ఎన్.జి.ఒ. హోం నందు ఉదయం శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభించారు. క్లబ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని జోనల్ చైర్ పర్సన్ లయన్ కె. ఎన్. పద్మావతి విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక సేవలతో పాటు ప్రస్తుతం ఉన్న వరవడిలో ప్రతి మనిషికి యోగా ధ్యానం తప్పనిసరని, చక్కని సేవలతో పాటు ప్రజలకు ఉపయోగపడే యోగ క్లాసులు ప్రారంభిస్తున్నందుకు తారకపురి ప్రెసిడెంట్ పవన్ కుమార్ ను, సెక్రెటరీ ఎన్.వి రాంకుమార్ ను అభినందించారు.
గెట్ మెంబర్ వావిలాల సరళాదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా నేర్పడానికి శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం కె. ఎన్. పద్మావతి దంపతులను సాలువాతో మెమొంటోతో సత్కరించారు.
సెక్రెటరీ రామకుమార్ సభను ప్రారంభించగా యోగా మాస్టర్ కర్రీ శ్రీనివాస్ రెడ్డి నిరంతరం యోగా నేర్పిస్తున్న ఈ తరుణంలో ఈ క్లబ్ కూడా మరొక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ అనంతరం యోగాను విచ్చేసిన వారందరిచే ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో లైన్ మెంబర్స్ కె శ్యామల, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, బి.సీత, బి.లక్ష్మిజ్యోతి, పి.రాజు, ఏ.గంగాధర్, వి.నాగమణి, వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


