తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎనస్తేషియా డే సందర్భంగా అత్యవసర సమయాల్లో గుండెకు సీపీఆర్ పై తణుకు లో ప్రముఖ ఎపిల్ కాలేజ్ ఆఫ్ బి. ఎస్. సి. నర్సింగ్ కాలేజ్ యందు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపిల్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన రోటరీ క్లబ్ వారాంతపు సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకట కృష్ణ మాట్లాడుతూ సిపిఆర్ అనే ప్రక్రియ అందరూ తెలుసుకోవడం చాలా అవసరమని అన్నారు. ఈ సమావేశానికి డాక్టర్ షేక్ అమీనా, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ డి.డిండి మా తదితరులు పాల్గొని శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 200 మంది నర్సింగ్ విద్యార్థులకు ఔత్సాహికులైన వ్యక్తులకు రోటరీ సభ్యులకు సోదాహరణంగా అవగాహన కల్పించారు. అదేవిధంగా అతిథులు విద్యార్థినులు స్వయంగా సిపిఆర్ చేసి అందరికీ చెప్పడం చేశారు, సందేహాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఓటేరియన్ జి. సుధాకర్, ఏ. దినేష్, అక్కిన కాశీ విశ్వనాథం, పుట్టా రామచంద్రరావు, ఆకుల శేషుబాబు, బోడపాటి ప్రసాద్, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, అడ్డాల ప్రసాద్, జె.ఎస్ సుబ్రహ్మణ్యం, బసవ రామకృష్ణ, వెలిచేటి సుందర్రావు, ఆపిల్ హాస్పిటల్ చైర్మన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


