ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు
తణుకు, అక్టోబరు17
గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 3 నెలల వేతన బకాయిలు, 41 నెలల పిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్ధాయికనుగుణంగా కనీసం ఏభై మందికి తగ్గకుండా పారిశుధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారం తొలగించాలని కోరుతూ ఈనెల 21 తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నట్టు ఏపీ మెడికల్ కాంటాక్టు వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. ఎ.పి.మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.సాయికిరణ్ కు ఆర్.ఎం. ఒ. డాక్టర్ తాతారావులకు సమ్మె నోటీసు సమర్పించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుధ్య కార్మికలకు ఇస్తున్న అతితక్కువ వేతనాలే నెలా నెలా సక్రమంగా ఇవ్వక పోవడంతో పస్తులతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. పిఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పిఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదన్నారు.150 పడకల స్థాయి కనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. తక్షణమే హాస్పిటల్ పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించి వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని భీమారావు డిమాండ్ చేశారు. మెడికల్ ఎంప్లాయిస్ అండ్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మాని పుష్పలత, భారతి, సీహెచ్ మంగమ్మ, పి.విజయలక్ష్మి, మెండి శ్రీను, వెంకటలక్ష్మి, ప్రసన్న, ఎం.బేబి, ఇ.హైమావతి, డి.శ్రీనువాసు, చింతాలు, డి.దంమూరు తదితరులు పాల్గొన్నారు.


